రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. శాంక్షన్ లెటర్స్ ఇచ్చేది ఆరోజే.. రూ.6,250 కోట్లు సబ్సిడీ.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..

రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి.. ఆర్థికంగా బలోపేతం చేయడానికి రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.

రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. శాంక్షన్ లెటర్స్ ఇచ్చేది ఆరోజే.. రూ.6,250 కోట్లు సబ్సిడీ.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..

Rajiv Yuva Vikasam

Updated On : May 23, 2025 / 10:10 AM IST

Rajiv Yuva Vikasam Scheme: రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి.. ఆర్థికంగా బలోపేతం చేయడానికి రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించిన అధికారులు.. క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత జూన్ 2న ఒకేసారి ఐదు లక్షల మంది లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Also Read: బీఆర్ఎస్‌లో లేఖ కాక.. కవిత లేఖను లీక్ చేసింది ఎవరు..? బీఆర్ఎస్ వర్గాల్లో ఆ అంశాలపై ఆసక్తికర చర్చ

రాజీవ్ యువవికాసం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఐదు లక్షల మందికి గరిష్ఠంగా రూ.4లక్షల విలువైన యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇప్పటికే క్షేత్ర స్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. ఈనెల 25వ తేదీ నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు పనిచేస్తున్నారు.

 

తాజాగా.. ఈ పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న 5లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంలో భట్టి పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీం కోసం రూ.9వేల కోట్లు కేటాయించగా.. రూ. 6,250 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్నదని తెలిపారు. గతంలో 70శాతం రుణం, 30శాతం సబ్సిడీ ఉండగా.. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లు వివరించారు. ఈ లక్ష్య సాధనకు అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని బ్యాంకర్లను భట్టి విక్రమార్క కోరారు.