రాజీవ్ యువ వికాసం కోసం అప్లై చేశారా? మీకో గుడ్ న్యూస్.. మంజూరు పత్రాలు మీ చేతికొచ్చేస్తున్నాయ్.. డేట్ ఫిక్స్

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.

రాజీవ్ యువ వికాసం కోసం అప్లై చేశారా? మీకో గుడ్ న్యూస్.. మంజూరు పత్రాలు మీ చేతికొచ్చేస్తున్నాయ్.. డేట్ ఫిక్స్

Rajiv Yuva Vikasam Scheme

Updated On : May 20, 2025 / 10:18 AM IST

Rajiv YuvaVikasam Scheme: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కల్పించే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ఈ పథకంలో భాగంగా తొలి ఏడాది ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని, మూడు నెలల్లో నెలకు రూ.2వేల కోట్లు చొప్పున ఖర్చుచేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ లబ్ధిదారులూ బీ అలర్ట్.. తప్పుడు సమాచారం ఇస్తే ఇబ్బందులే.. వెంటనే పట్టేస్తోన్న ఏఐ..! ఎలా అంటే..?

రాజీవ్ యువవికాసం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఐదు లక్షల మందికి గరిష్ఠంగా రూ.4లక్షల విలువైన యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇప్పటికే క్షేత్ర స్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. ఈనెల 25వ తేదీ నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు పనిచేస్తున్నారు.

Also Read: Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్.. నాలుగెకరాలు పైబడిన రైతులు ‘రైతుభరోసా’ నిధులు వచ్చేస్తున్నాయ్..! మరి ఖరీఫ్ నిధులు ఎప్పుడొస్తాయంటే..?

క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. అయితే, ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధిపొందిన వారు ఐదేళ్లపాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్ తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను అధికారులు తొలగిస్తున్నారు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న చాలా మందికి చుక్కెదురవుతుంది. మరోవైపు కుటుంబానికి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టిన విషయం తెలిసిందే.

 

కార్పొరేషన్ల వారీగా వివరాలు ఇలా..
♦ ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో 1.44లక్షలు యూనిట్లు లక్ష్యంకాగా.. 3.92లక్షల దరఖాస్తులు వచ్చాయి.
♦ ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 91వేలు యూనిట్ల లక్ష్యంకాగా 1.83లక్షల దరఖాస్తులు వచ్చాయి.
♦ బీసీ కార్పొరేషన్ పరిధిలో 1.55లక్షలు యూనిట్ల లక్ష్యం కాగా.. 8.01 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
♦ ఈబీసీ కార్పొరేషన్ పరిధిలో 51వేలు యూనిట్ల లక్ష్యంకాగా.. 37వేలు దరఖాస్తులు వచ్చాయి.
♦ మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో 45వేలు యూనిట్ల లక్ష్యం కాగా.. 2.04లక్షల దరఖాస్తులు వచ్చాయి.
♦ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో 5వేలు యూనిట్ల లక్ష్యం కాగా.. 4,600 దరఖాస్తులు వచ్చాయి.