Rajoli Police: బూటు కాలితో తన్ని.. చావబాదిన ఎస్సై.. వీడియో వైరల్!
దేశంలోనే తెలంగాణ పోలీసులకు ఫ్రెండ్లీ పోలీసులుగా గుర్తింపు. ఒకవిధంగా ప్రజల కోసం తామున్నామని.. ప్రజలతోనే కలిసి పనిచేస్తున్నారు తెలంగాణ పోలీసులు. అయితే, ఒకరిద్దరు కిందిస్థాయి..

Rajoli Police
Rajoli Police: దేశంలోనే తెలంగాణ పోలీసులకు ఫ్రెండ్లీ పోలీసులుగా గుర్తింపు. ఒకవిధంగా ప్రజల కోసం తామున్నామని.. ప్రజలతోనే కలిసి పనిచేస్తున్నారు తెలంగాణ పోలీసులు. అయితే, ఒకరిద్దరు కిందిస్థాయి పోలీసుల వలన ప్రజలలో భయాందోళన కలిగిస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్నాడన్న కారణంగా ఓ పోలీస్ ఎస్సై ఓ వ్యక్తిని చితకబాదాడు. మొహంపై బూతు కాలితో తన్నుతూ చావబాది అక్కడే వదిలేసి వెళ్ళాడు. ఎస్సై చితకబాదిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
జోగులాంబ గద్వాల జిల్లాలో కర్నూలుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిని రాజోలి ఎస్ఐ లెనిన్ బాబు చితకబాదాడు. అతని ముఖంపై బూటు కాలితో తన్నాడు. రాజోలి మండల కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరిహద్దుల్లో ఉన్న ఓ వైన్‌షాప్‌క్‌కి మందు మందుబాబులు భారీగా తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే లక్ష్మణ్ అనేవ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు మద్యం సేవిస్తూ కనిపించాడు. దీంతో ఎసై ఆ వ్యక్తిని బ్రీత్ ఎనలైజర్ టెస్టుకి పిలిచినా రాకపోవడంతో చేయిచేసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే, బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తున్న సమయంలో లక్ష్మణ్ ఎస్‌ఐతో గొడవ పడి వెహికల్‌పై రాళ్లతో దాడిచేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఏదైనా కానీ ఎస్సై లక్ష్మణ్‌ను చితకబాదడంతో పాటు బూటు కాలితో ముఖంపై తన్నడంతో అక్కడిక్కడే కుప్పకూలాడు. దీంతో అతన్ని వదిలేసిన పోలీసులు మరొకరిని చావబాదారు. దీన్ని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
https://twitter.com/CoreenaSuares2/status/1442521179139416068?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1442521179139416068%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.oneindia.com%2Fnews%2Ftelangana%2Fjogulamba-gadwal-sub-inspector-lenin-babu-beat-up-a-man-and-kicked-with-boots-302927.html