Rakesh Tikait: పీపుల్స్ ఫ్రంట్ రావాల్సిన అవసర ఉంది: రాకేశ్ టికాయత్

రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు పధకాలు దేశమంతటా అమలు కావాలని డిమాండ్ చేశారు

Rakesh Tikait: పీపుల్స్ ఫ్రంట్ రావాల్సిన అవసర ఉంది: రాకేశ్ టికాయత్

Kcr Tikait

Updated On : March 3, 2022 / 5:49 PM IST

Rakesh Tikait: దేశ రాజకీయాల్లో బలమైన పోటీ ఉండాలని.. ప్రస్తుత పరిస్థితుల్లో పీపుల్స్ ఫ్రంట్ రావాల్సిన అవసర ఉందని బీకేయూ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ అన్నారు. గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ తో రాకేశ్ టికాయత్ ఢిల్లీలో భేటీ అయ్యారు. బీజేపీ ఎంపీ సుబ్రహమణ్యం స్వామి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటల పాటు వీరు సమావేశం అయ్యారు. సమావేశ అనంతరం బీకేయూ నేత రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు పధకాలు దేశమంతటా అమలు కావాలని డిమాండ్ చేశారు. రైతులకు కేంద్రం ఇస్తున్న పంట సాయం కన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు ఎక్కువగా ఉంటుందని రాకేశ్ తెలిపారు. సీఎం కేసీఆర్ తో వ్యవసాయ అంశాల గురించి మాత్రమే చర్చ జరిగిందని, రాజకీయ అంశాలపై చర్చించలేదని రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.

Also read: Delhi Cops : తెలంగాణ పోలీసుల తీరుపై ఢిల్లీ పోలీసులు సీరియస్

రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సహాయం, చనిపోయిన రైతుల జాబితా గురించి మాట్లాడుకున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 10 తరువాత జాబితా పంపిస్తాం..దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతులు ఉద్యమంలో చనిపోయారని వారి వివరాలను సంయుక్త కిసాన్ మోర్చా తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తుందని రాకేశ్ పేర్కొన్నారు. దేశంలో రైతు డిమాండ్ల కోసం మార్చి 10 తరువాత దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వెళ్లి రైతులను కలుస్తామని.. రైతు సమస్యలపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తామని రాకేశ్ టికాయత్ తెలిపారు. యూపీలో బీజేపీపై వ్యతిరేకత ఉందన్న రాకేష్ టికాయత్..రానున్న రోజుల్లో పీపుల్స్ ఫ్రంట్ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Also read: AP High Court on CRDA: హై కోర్టు తీర్పును స్వాగతించిన నేతలు సుజనా చౌదరి, పురంధేశ్వరి, ఇతరులు