Rasamayi Balakishan: మళ్ళీ రసమయినే తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్!
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా మరోసారి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కే అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయికి సమున్నత గౌరవం కలిపించింది ప్రభుత్వం.

Rasamayi Balakishan
Rasamayi Balakishan: తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా మరోసారి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కే అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయికి సమున్నత గౌరవం కలిపించింది ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. దానికి ఛైర్మన్‌గా రసమయిని నియమించారు.
అయితే, ఆయన పదవి కాలం ముగిసిన తర్వాత కొన్ని ఏళ్లుగా ఈ సాంస్కృతిక ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది. అయితే, మరోసారి రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ చైర్మన్ పదవీ కాలం మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. దీంతో సీఎం కేసీఆర్‌ను కలిసిన రసమయి.. మరోసారి తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సిఎం కేసీఆర్ చేతుల మీదుగా తన నియామక పత్రాన్ని రసమయి అందుకోగా సీఎం కేసీఆర్ రసమయిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఉద్యమంలో కష్టపడి పనిచేసిన సాంస్కృతిక కళాకారులను రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి, వారికి ఉద్యోగాలిచ్చిందని అన్నారు. కోర్టు ఆదేశాలమేరకు అందరికీ సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని సీఎం పేర్కొన్నారు.