ఆర్బీఐ హెచ్చరిక.. అర్జంట్ గా మీరు ఈ పని కంప్లీట్ చేయకపోతే మీ అకౌంట్ ఫ్రీజ్..
ఖాతాదారుల భద్రత, ఆర్థిక నేరాల నియంత్రణలో భాగంగా 'నో యువర్ కస్టమర్(RBI Re-KYC)' ప్రక్రియను బ్యాంకులు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించింది.
RBI imposed Re-KYC rules mandatory for all bank customers
- ఆర్బీఐ రీకేవైసీ నిబంధనలు కఠినం
- పూర్తికాకపోతే బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
- తెలంగాణలో లక్షల ఖాతాలు పెండింగ్
RBI Mandatory Re-KYC: బ్యాంకు ఖాతాదారులు తమ వ్యక్తిగత గుర్తింపు, చిరునామా వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఖాతాదారుల భద్రత, ఆర్థిక నేరాల నియంత్రణలో భాగంగా ‘నో యువర్ కస్టమర్(Rbi Mandatory Re-KYC)’ ప్రక్రియను బ్యాంకులు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించింది. తాజా కేవైసీ వివరాలు సమర్పించని ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలిపింది.
ఖాతాల రిస్క్ ఆధారంగా కేవైసీ గడువు నిర్ణయం:
లావాదేవీల తీవ్రత ఆధారంగా ఖాతాలను మూడు రకాలుగా విభజించేలా బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. తరచూ రూ. 50 వేలకు మించి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగే ‘హైరిస్క్’ ఖాతాదారులు ప్రతి రెండేళ్లకొకసారి కేవైసీ సమర్పించాలి. అలాగే ‘మీడియం రిస్క్’ ఖాతాదారులు ప్రతి ఎనిమిదేళ్లకు, తక్కువ లావాదేవీలు జరిగే ‘లోరిస్క్’ ఖాతాదారులు ప్రతి పదేళ్లకు ఒకసారి రీ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి.
తెలంగాణలో లక్షల్లో పెండింగ్ ఖాతాలు:
తెలంగాణలో గత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి దాదాపు 24,59,248 బ్యాంకు ఖాతాల్లో కేవైసీ వివరాలు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 2.88 లక్షల ఖాతాల్లో అసలు ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని తేలింది. ఒక ప్రధాన బ్యాంకులోనే ఏకంగా 9.90 లక్షల ఖాతాలు రీ-కేవైసీ కోసం వేచి ఉన్నాయి. సూచించిన గడువులోగా తాజా వివరాలు అందించకపోతే ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.
