Caucasian Shepherd : ఈ శునకం ఖరీదు అక్షరాల రూ.20 కోట్లు.. ఏంటి అంత స్పెషల్?

కుక్కల కోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చుపెట్టే వారిని చూసి ఉంటాం. కానీ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి లగ్జరీ సౌకర్యాలు అందించేవారిని మీరు ఎప్పుడైనా చూసారా? ఓ ఖరీదైన శునకం.. దాని యజమాని గురించి చదవండి.

Caucasian Shepherd : ఈ శునకం ఖరీదు అక్షరాల రూ.20 కోట్లు.. ఏంటి అంత స్పెషల్?

Caucasian Shepherd

Updated On : December 17, 2023 / 4:41 PM IST

Caucasian Shepherd : చాలామంది డాగ్ లవర్స్ ఉంటారు. ఖరీదు పెట్టి మరి తమకు ఇష్టమైన జాతి శునకాలను తెచ్చి పెంచుకుంటారు. కానీ కోట్లు ఖరీదైన శునకాన్ని కొనడమే కాదు.. దానికి లగ్జరీ లైఫ్ అందిస్తున్నాడు ఓ వ్యక్తి. కోట్లు ఖర్చుపెట్టి మరీ కొనడానికి ఆ శునకం ప్రత్యేకత ఏంటి? చదవండి.

Amazing Dog : 17 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడటం కోసం ఆ డాగ్ ఏం చేసిందంటే?.. చదవండి

ఆ డాగ్ ఎక్కడికి వెళ్లిన చూడటానికి జనం ఎగబడతారు. సెల్ఫీలు, వీడియోలు మామూలు హంగామా ఉండదు. ఇంతకీ ఆ డాగ్ ప్రత్యేకత ఏంటి అంటారా? భారతదేశంలోనే ఖరీదైన ఆ డాగ్ ‘కకేషియన్ షెపర్డ్’ జాతికి చెందినది. ఈ శునకాలు ఎక్కువగా అర్మేనియా, సిర్కాసియా, టర్కీ, అజర్‌బైజాన్, డాగేస్తాన్, జార్జియాలలో కనిపిస్తాయి. ఇక ఈ శునకం రాజయోగం మామూలుగా ఉండదు. ఇంతకీ ఈ శునకం పేరేంటి అంటారా? ‘కాడబామ్ హేడర్’. ఈ మధ్య బెంగళూరు నుండి హైదరాబాద్‌కి వచ్చింది. పెట్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఈ డాగ్ మియాపూర్‌లో సందడి చేసింది. దీనిని చూసేందుకు జనం మామూలుగా ఎగబడలేదు.

Mumbai : కుక్కల మెడలో QR కోడ్ .. తప్పిపోయిన డాగ్స్ ట్రాక్ చేయడానికి క్రియేట్ చేసిన ఇంజనీర్

కాడబామ్ హేడర్‌ను ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అద్యక్షుడు సతీష్ గతేడాది జనవరిలో హైదరాబాద్‌కి చెందిన డాగ్ బ్రీడర్ నుండి అక్షరాల రూ.20 కోట్లు ఖర్చుపెట్టి మరీ కొనుగోలు చేశారు. ఈ డాగ్ ఇప్పటికి పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని 32 పతకాలు సాధించింది. సినిమాల్లో కూడా నటించింది. ఈ డాగ్ రోజు 3 కేజీల చికెన్ తింటుంది. ఈ ఒక్క డాగ్‌కి నెలకు రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని సతీష్ చెబుతున్నారు. సతీష్ దగ్గర ఈ డాగ్ మాత్రమే కాకుండా రూ.10 కోట్లు విలువ చేసే టిబెటన్ మాస్టిఫ్, రూ.8 కోట్లు విలువ చేసే అలాస్కన్ మాలమ్యూట్ డాగ్స్ కూడా ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Satish S (@satishcadaboms)