Go 317 : హీటెక్కుతున్న పాలిటిక్స్…తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రుల క్యూ
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణలో పర్యటించి....

Bjp Vs Trs
Bandi Sanjay : టీఆర్ఎస్ – బీజేపీ పోటాపోటీ రాజకీయాలతో.. తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. నువ్వా – నేనా అన్నట్లు టీఆర్‌ఎస్- బీజేపీ రాజకీయ చదరంగంలో సవాళ్లు – ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. తెలంగాణలో తమ స్థానాన్ని అదే స్థాయిలో నిలుపుకునేందుకు గులాబీ బాస్ ప్లాన్స్ చేస్తుంటే.. అదే రేంజ్‌లో కమలం నేతలు తమ పథకాలను అమల్లోకి తెస్తున్నారు. అందివచ్చిన ఏ ఒక్క ఛాన్స్‌ను వదులుకోవట్లేదు బీజేపీ నేతలు.
Read More : Corona India : భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు
టీఆర్ఎస్-బీజేపీ మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వార్.. రోజురోజుకు కొత్త లెవెల్‌కి చేరుకుంటోంది. బీజేపీ నేషనల్ లీడర్లంతా.. వరుస పెట్టి రాష్ట్రానికి రావడం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, విమర్శలు చేస్తుండటంతో పొలిటికల్ వెదర్ బాగా హీటెక్కింది. బండి సంజయ్ అరెస్ట్, జైల్, బెయిల్ ఎపిసోడ్ తర్వాత.. తెలంగాణ పాలిటిక్స్ ఓ రేంజ్‌లో హీటెక్కాయ్. ప్రతి లోకల్ ఇష్యూని.. నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు ట్రై చేస్తున్నారు. జీవో నెంబర్ 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు పెంచుతోంది.
Read More : Kalyan Krishna : ‘బంగార్రాజు’లో నాగార్జున మనవడిగా చైతూ కనిపిస్తాడు
ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణలో పర్యటించి టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించగా.. 2022, జనవరి 09వ తేదీ ఆదివారం అసోం సీఎం హిమంత బిశ్వశర్మ రాష్ట్రానికి వస్తున్నారు. హన్మకొండలో బీజేపీ నిర్వహించనున్న సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారాన్ని.. బాగా క్యాష్ చేసుకోవాలని బీజేపీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ గురించి.. రాష్ట్రమంతటా చర్చ జరగాలనే ఉద్దేశంతో స్టేట్ బీజేపీ నాయకత్వం.. మిగతా రాష్ట్రాల బీజేపీ నేతలను రాష్ట్రానికి రప్పిస్తున్నట్లు అర్థమవుతోంది.