Youth Declaration: యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించిన రేవంత్ రెడ్డి.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఇంకా ఎన్నో

Youth Declaration: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏం చేస్తుందో చెప్పారు రేవంత్ రెడ్డి.

Youth Declaration: యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించిన రేవంత్ రెడ్డి.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఇంకా ఎన్నో

Revanth Reddy

Youth Declaration: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. యువతకు పలు హామీలు ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో ఆయన మాట్లాడుతూ… “తెలంగాణ గడ్డపై మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీ కాలుమోపారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు. తెలంగాణ పౌరుషానికి వేదికలు” అని అన్నారు.

“మా కొలువులు మాకు కావాలనే ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 12.50 లక్షలు. విభజన తరువాత తెలంగాణకు 5.30లక్షలు ఉద్యోగులను కేటాయించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 1.7 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారు.

బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ పాలనలో ఇక నిరుద్యోగులకు న్యాయం జరగదు. అందుకే నిరుద్యోగులకు అండగా నిలబడేందుకు ప్రియాంక గాంధీ ఇక్కడకు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను అమలు చేస్తాం” అని అన్నారు.

డిక్లరేషన్ అంశాలు…

1. అమరులను ఉద్యమ వీరులను గుర్తించి వారి కుటుంబాలకు రూ.25వేల పెన్షన్ అందిస్తాం. ఉద్యమకారులపై కేసులు ఎత్తేసి గుర్తింపుకార్డు అందిస్తాం.

2.కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి, ప్రతి ఏటా ఖాళీలను భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువకులకు నెలకు రూ.4వేలు భృతి అందించి ఆదుకుంటాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పారదర్శక నియామకాలు చేపడతాం.

3. నిరుద్యోగరహిత రాష్ట్రంగా మార్చేందుకు సెంట్రలైజేడ్ లైన్ విధానం తెస్తాం. విద్యార్థి, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తాం. పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు 75శాతం అవకాశాలు కల్పించేలా చట్టం తీసుకొస్తాం. యూత్ కమిషన్ ద్వారా యువతను ఆదుకుంటాం. రూ.10లక్షలు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చి వారిని ఆదుకుంటాం. భవిష్యత్ లో ఒక్కరు కూడా ఏజెంట్ల చేతిలో మోసపోకుండా చర్యలు తీసుకుంటాం.

4. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో నూతన యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తాం. బాసర ఐఐటీ తరహలో మరో నాలుగు ఐఐటీలు ఏర్పాటు చేస్తాం. పోలీసులు, ఆర్టీసీ కార్మికుల కోసం వరంగల్, హైదరాబాద్ లో ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం. వారి పిల్లలకు ఉచిత విద్యను అందిస్తాం.

5. యువమహిళా సాధికారతలో భాగంగా చదువుకునే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ అందిస్తాం. యువత భవితే కాంగ్రెస్ నినాదం… అమరుల ఆశయ సాధన కాంగ్రెస్ విధానం. ప్రియాంక గాంధీ నయా ఇందిరమ్మ.. వేల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణకు వస్తుందంటే అది ఇందిరమ్మ దయ.

KA Paul: అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాలేదు: కేఏ పాల్