Telangana New CM: సీఎంగా రేవంత్.. డిప్యూటీగా భట్టి.. కాసేపట్లో ప్రకటన

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన అనంతరం నుంచి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కల పేర్లు ఎక్కువగా వినిపించాయి

Telangana New CM: సీఎంగా రేవంత్.. డిప్యూటీగా భట్టి.. కాసేపట్లో ప్రకటన

తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ హైకమాండ్ దాదాపుగా క్లారిటీ ఇచ్చేసినట్లే తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి కాబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇక మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఢిల్లీ నుంచి కాసేపట్లోనే ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన అనంతరం నుంచి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కల పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఈ చర్చకు కాసేపట్లో ఏఐసీసీ కాసేపట్లో తెరదించనుంది.

పూర్తి వివరాల కోసం కింది వీడియో చూడండి..