Revanth Reddy : కొడంగల్ లో నాపై కేసీఆర్ పోటీ చేయాలని.. రేవంత్ రెడ్డి సవాల్

కొడంగల్ నియోజకవర్గంను అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు.

Revanth Reddy : కొడంగల్ లో నాపై కేసీఆర్ పోటీ చేయాలని.. రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy Challenge KCR

Updated On : October 24, 2023 / 6:21 PM IST

Revanth Reddy – KCR : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకదానికొకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

కొడంగల్ లో తనపై కేసీఆర్ పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. కొడంగల్ అభివృద్ధి జరిగితే కేసీఆర్ తనపై పోటీ చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంను అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు.

CM KCR : సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనలో స్వల్ప మార్పులు.. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎప్పుడెప్పుడంటే?

కేటీఆర్ దత్తత తీసుకున్న ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల భూ పంపిణీ, సాగునీరు వంటి సమస్యలు పరిష్కరించలేందటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.