Revanth Reddy : కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్-కేఏపాల్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లాగా పని చేస్తున్నాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు.

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్-కేఏపాల్

ka paul revanth reddy

Updated On : August 12, 2022 / 3:34 PM IST

Revanth Reddy :  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లాగా పని చేస్తున్నాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు. ఈరోజు ఆయన హైదరబాదాలో విలేకరులతో  మాట్లాడుతూ.. భట్టి,  వి.హెచ్, జానారెడ్డి లాంటి   సీనియర్ నాయకులు ఉన్న తరువాత రేవంత్ కి పీసీసీ ఇచ్చారని…కాంగ్రెస్ నేతలు పీసీసీ పదవి అమ్ముకున్నారని చెప్పారు. రేవంత్ వల్లే నేతలు కాంగ్రెస్ నుంచి బయటకు వెళుతున్నారని చెప్పారు.

రేపో మాపో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా బీజేపీ లో చేరతారని పాల్ జోస్యం చెప్పారు. ప్రజాశాంతి పార్టీ మునుగోడు  బై ఎలక్షన్ లో పోటీ చేస్తుందని.. ఈనెల 19న మునుగోడులోని అన్ని మండలాల్లో రోడు షో చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్, బండి సంజయ్ లతో నన్ను పోల్చవద్దని కేసీఆర్ కు పాల్ విజ్ఞప్తి చేశారు. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్  ఓడిపోతాయని పాల్ చెప్పారు. టీఆర్ఎస్ తప్పుల వల్లే రాష్ట్రంలో   బీజేపీ బలపడుతోందని కేఏపాల్ అన్నారు.

Also Read : Munugodu Politics : నా రాజీనామా తరువాతే కేసీఆర్ చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి