Munugodu Politics : నా రాజీనామా తరువాతే కేసీఆర్ చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడుకు ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ స్పందిస్తారని నాకు తెలుసు..అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని నేను రాజీనామా చేశాకే కేసీఆర్ మునుగోడు నియోజక వర్గం విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారని. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారని అన్నారు.
Munugodu Politics
Munugodu Politics : మునుగోడు ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు. రాజగోపాల్రెడ్డి శుక్రవారం మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజక వర్గం ప్రజల అభివృద్ధికి సహాకరించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఎందుకంటే తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను కాబట్టి పట్టించుకోలేదని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. తాను రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుందని..ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ మునుగోడు గురించి పట్టించుకుంటారని అందుకే తాను రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. అది ఎంత నిజమో తాను రాజీనామా చేశాకే మునుగోడు నియోజవర్గంలోని చేనేత కార్మికులకు కేసీఆర్ పెన్షన్లు ప్రకటించారని అన్నారు.
మునుగోడుకు ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ స్పందిస్తారని నాకు తెలుసు..అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు రాజగోపాల్. దీంట్లో తనకు ఎటువంటి స్వార్థ రాజకీయాలు లేవని మరోసారి తెలిపారు. నేను రాజీనామా చేశాకే కేసీఆర్ మునుగోడు నియోజక వర్గం విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారని. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని తెలిపారు.
మునుగోడు నియోజక వర్గంలోని సర్పంచ్లకు ఫోన్లు చేస్తున్నారని..నా రాజీనామాతోనే ఫండ్స్ రిలీజ్ చేశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రభుత్వం నిధులను అడ్డుకుంటోందని… ప్రభుత్వం వివక్షతో ప్రవర్తిస్తోదని ఆరోపించారు. మొన్నటి వరకు మునుగోడుపై మాట్లాడితే సీఎం కేసీఆర్ స్పందించలేదు. కానీ.. నా రాజీనామా తర్వాత సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు కేటాయించలేదు. కానీ.. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటూ ఆరోపించారు. ఇదంతా మునుగోడులో గెలుపు కోసం మాత్రమేనంటూ విమర్శలు సంధించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
