Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ చేస్తాం.. రూ.12 లక్షల ఆర్థిక సాయం ఇస్తాం.. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల
ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Revanth Reddy
Revanth Reddy – Congress: తెలంగాణ ఎన్నికల (Telangana elections 2023) వేళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చదువుతుండడంతో తన జన్మ ధన్యమైనట్లు భావిస్తున్నానని చెప్పారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని అన్నారు.
అలాగే, చేవెళ్ల సభలో కాంగ్రెస్ లో పలువురు నేతలు చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆర్మూర్ నేతలు గోర్త రాజేందర్, వినయ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థి సంఘ నాయకుడు కోట శ్రీనివాస్ చేరారు.
డిక్లరేషన్ ముఖ్యాంశాలు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తాం
అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షల ఆర్థిక సాయం
ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతాం
ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తాం
ఇందిరమ్మ ఇంటి స్కీమ్, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి అరు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాం
అసైన్డ్, అటవీభూములు, పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
పోడు భూములకు పట్టాలు
ఎస్సీ, ఎస్టీలకు 3 కార్పొరేషన్ల చొప్పున ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో కొత్తగా 5 ఐటీడీఏలు ఏర్పాటు చేస్తాం
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10 వేలు ఇస్తాం
ప్రతి మండలంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తాం
గ్రాడ్యుయేషన్, పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పిస్తాం
Vatte Janaiah Yadav: బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తానని చెప్పగానే.. వట్టే జానయ్యపై భూముల ఆక్రమణ కేసులు