Revanth Reddy : హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని.. చంద్రబాబు అరెస్ట్‌‌పై కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

వారి నిరసన అడ్డుకుంటే.. మూతి పళ్లు రాలగొడతారు. మీ వాళ్లు ఢిల్లీలో ఆందోళన చేయలేదా? అమెరికాలో నిరసనలు తెలపలేదా? Revanth Reddy

Revanth Reddy : హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని.. చంద్రబాబు అరెస్ట్‌‌పై కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy Slams KTR : చంద్రబాబు అరెస్ట్ ఏపీకి సంబంధించిన విషయం, తెలంగాణకు ఏం సంబంధం? చంద్రబాబు అరెస్ట్ అయితే హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు? తెలంగాణలో నిరసనలు చేయొద్దు.. అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పలువురు నేతలు కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కేటీఆర్ పై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఏపీ టీడీపీ నాయకులు కేటీఆర్ పై సీరియస్ అయ్యారు. కేటీఆర్ తీరుని తప్పు పడుతున్నారు.

కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, చంద్రబాబుకి మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. మీడియాతో చిట్ చాట్ లో పలు అంశాలపై రేవంత్ రెడ్డి ఓపెన్ అయ్యారు. అందులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన ఆయన రియాక్ట్ అయ్యారు.

వాళ్ల ఓట్లు కావాలి, నిరసన వద్దా?
”చంద్రబాబు విషయంలో.. కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కేవలం ఏపీకి సంబంధించిన విషయం కాదు. అది దేశ రాజకీయాలకు సంబంధించిన అంశం. చంద్రబాబు విషయంలో నిరసన వ్యక్తం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఎవరైనా అడ్డగిస్తామంటే కరెక్ట్ కాదు. వాళ్ల ఓట్లు కావాలి. కానీ వారి నిరసన వద్దా? వారి నిరసన అడ్డుకుంటే.. మూతి పళ్లు రాలగొడతారు. సామాన్య ప్రజలకు నిరసన తెలిపే అధికారం ఉంటుంది. ఏదైనా అనే ముందు హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Also Read..Nannapaneni Rajakumari : మీకు ఇక్కడేం పని అంటారా.. చంద్రబాబుపై కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: నన్నపనేని రాజకుమారి డిమాండ్

మీరు అమెరికాలో నిరసన తెలపలేదా?
దేశంలో ఏ పౌరుడైనా నిరసన వ్యక్తం చేయవచ్చు. బీఆర్ఎస్ వాళ్లు ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేయలేదా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి ప్రజలు అమెరికాలో కూడా నిరసన తెలిపారు. ఐటీ ఉద్యోగులు శాంతియుతంగా నిరసన తెలిపితే మీకు వచ్చిన నష్టం ఏంటి?  శాంతిభద్రతల విషయం పోలీసులు చూసుకుంటారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేతలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు బిగ్ పర్సనాలిటీ” అని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

Also Read..KTR: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. మాకేం సంబంధం.. హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు?