Karimnagar Road Accident : కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది.

Karimnagar Road Accident : కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

Road Accident

Updated On : July 4, 2023 / 8:04 AM IST

Karimnagar District: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం  రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఇద్దరు యువకులను కరీంనగర్ ప్రభుత్వం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు మృతి చెందారు.

Fire Breaks Out : ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం, నలుగురి మృతి

మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు. చిగురుమామిడి మండలం రామంచ గ్రామం. పని ముగించుకొని రేణిగుంటలో ఓ దాబాలో భోజనం చేసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాల సేకరించారు. మృతులు గుడ్డిపల్లి అరవింద్(28), శివరాత్రి సంపత్(27), శివరాత్రి అంజి(26)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ముగ్గురు యువకులు మృతితో రామంచ గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.