ఏపీలో 7 గురు తెలంగాణావాసులు మృతి..

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీకొని 7గురు మంది మృతి చెందారు.మరో 14మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చి గాయపడినవారిని జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించి చికిత్స నందించారు. అనంతరం వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. మృతులను ఖమ్మం జిల్లా మధిర వాసులుగా పోలీసులు గుర్తించారు.
ట్రాక్టర్, లారీ బలంగా ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లుగా తెలుస్తోంది.జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. మధిర మండలం గోపవరం నుంచి ట్రాక్టర్లలో ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా సమాచారం.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.