Fire Accident : హైదరాబాద్ కుషాయిగూడ అగ్నిప్రమాద మృతులకు రూ.2 లక్షల పరిహారం
స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకారమని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు.

Fire Accident (1)
Fire Accident : హైదరాబాద్ లోని కుషాయిగూడ అగ్నిప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద కారణాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కుషాయిగూడ అగ్నిప్రమాద మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు బాధితులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకారమని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. ఘటనకు సంబంధించి ఉదయం 4 గంటలకు పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. ఘటన గురించి తెలియగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది, డి ఆర్ ఎఫ్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారని తెలిపారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు వారి కుమారుడి భవిష్యత్ కు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Fire Accident : హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నిర్లక్ష్యం వహించిన టీంబర్ డిపో యజమానిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే జనావాసాల మధ్య ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ లకు సేఫ్టీకి సంబంధించి నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. నగరంలో జనావాసాల మధ్య ఉన్న టీంబర్ డిపోల వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని కుషాయిగూడలోని జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు డిపో మొత్తానికి అంటున్నాయి. భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న భవనానికి మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న దంపతులు సహా బాలుడు సజీవ దహనం అయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైన మూడు మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటికి తీశారు.
కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు. మృతులు నల్గొండ జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్(35), సుమ(28), జోషిత్(8)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.