సిద్దిపేట జిల్లాలో భారీగా నగదు పట్టివేత..ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు స్వాధీనం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. ఓ ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు దొరకడం కలకలం రేపింది.

సిద్దిపేట జిల్లాలో భారీగా నగదు పట్టివేత..ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు స్వాధీనం

Updated On : March 6, 2021 / 8:47 PM IST

Rs 66 lakh seized in husnabad : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. ఓ ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు దొరకడం కలకలం రేపింది. పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించగా.. కట్టలకొద్దీ డబ్బు దర్శనమిచ్చింది.

మొత్తం అరవై ఆరు లక్షల పదకొండు వేల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ డబ్బు ఎవరిది.. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.