Sabitha Indra Reddy: కర్మకాలి అసెంబ్లీకి వచ్చామంటూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి

పార్టీ మారారని అనే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

Sabitha Indra Reddy: కర్మకాలి అసెంబ్లీకి వచ్చామంటూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి

Sabitha Indra Reddy

Updated On : July 31, 2024 / 6:28 PM IST

అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగలా పారిపోయారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలు బాధాకరమని చెప్పారు. తమ కర్మకాలి అసెంబ్లీకి వచ్చామంటూ సబిత కంటతడి పెట్టుకున్నారు.

పార్టీ మారారని అనే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తాము పార్టీ మారలేదని, పార్టీ నుంచి బయటకు మెడ పట్టి గెంటేశారని అన్నారు. తమ కుటుంబానికి ఓ చరిత్ర ఉందని చెప్పారు. 2014లో టికెట్ ఇవ్వకపోయినా తాను పార్టీ కోసం పనిచేశానని తెలిపారు. రాజకీయాల్లో తనను రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారని, మహిళలను మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారని చెప్పారు.

ఇప్పుడు మహిళలను కనీసం మాట్లాడనివ్వడం లేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదని, నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిన పదవి అని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేశామని సునీతారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా జెండా మోసి కార్యకర్తలను కాపాడుకున్నామని తెలిపారు.

Also Read: ఆరోగ్యశ్రీ పథకంపై కూటమి ప్రభుత్వం విధానం ఏంటో సీఎం చెప్పాలి- మాజీమంత్రి విడదల రజిని