తెలంగాణలో రెండో కరోనా కేసు?
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రం

చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రం
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ కరోనా అలజడి మొదలైంది. తెలంగాణలో తొలి కేసు నమోదు కావడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. తొలి కేసు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్రీ అవుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం రేగింది. (ఏపీలోనూ కరోనా కలకలం.. కోనసీమలో వ్యక్తికి కొవిడ్ లక్షణాలు)
దుబాయ్ నుంచి వ్యక్తిలో కరోనా లక్షణాలు:
నిజామాబాద్ జిల్లాలో కొవిడ్-19 వైరస్ అలజడి రేపింది. ఇటీవల దుబాయ్ నుంచి ఓ వ్యక్తిలో కరోనా లక్షణాలు బయటపడ్డట్లు మంగళవారం (మార్చి 3,2020) సాయంత్రం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందల్వాయి మండటం ఎల్లారెడ్డిపల్లికి చెందిన 50 ఏళ్ల బాలరాజు అనే వ్యక్తి వారం రోజుల కిందట దుబాయ్ నుంచి స్వస్థలానికి వచ్చాడని.. తాజాగా అతడు జ్వరం, జలుబుతో స్థానిక ఆస్పత్రిలో చేరాడని తెలుస్తోంది. కరోనా లక్షణాలుగా అనుమానించిన డాక్టర్లు వెంటనే అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. బాధితుడితో పాటు అతడి భార్యలోనూ కరోనా లక్షణాలు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని న్యూస్ ఛానెళ్లలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కాగా, ఈ వార్తను అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం ఇప్పటివరకు తమ దృష్టికి ఎలాంటి కేసులు రాలేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌పై కొన్ని మీడియా వర్గాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.
దక్షిణ కొరియా నుంచి వచ్చిన తూ.గో. వాసి:
అటు ఏపీలోనూ కరోనా కలకలం రేగింది. కోనసీమలో ఓ వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడం భయాందోళనకు గురి చేసింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంకి చెందిన బండారు వెంకటేశ్వర్లుకి కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు. బండారు వెంకటేశ్వర్లు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే సౌత్ కొరియా నుంచి వచ్చాడు. విమానం దిగినప్పుడు చేసిన టెస్ట్ లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. బాధితుడు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినట్లు తెలుసుకుని అధికారులు అలర్ట్ అయ్యారు.
అత్తగారింటికి వెళ్లిన కరోనా బాధితుడు:
బాధితుడు తన అత్తగారి ఇల్లు గోదశివారుపాలెం వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని బాధితుడిని ప్రత్యేక అంబులెన్స్ లో కాకినాడకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వార్త కోనసీమ ప్రజలను భయాందోళనకు గురి చేసింది. చైనా తర్వాత కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న దేశాల్లో సౌత్ కొరియా ఒకటి. బాధితుడు అక్కడి నుంచి రావడం ఆందోళనకు గురి చేస్తోంది.
80 దేశాల్లో కరోనా కల్లోలం:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. చైనాని నాశనం చేసిన కరోనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటివరకు 80కుపైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. 90వేల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 3వేల 500 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. దీంతో అంతా హడలిపోతున్నారు.
* తెలంగాణలో రెండో కరోనా కేసు..?
* కరోనా వైరస్ అనుమానంతో ఆసుపత్రిలో చేరిన మరో వ్యక్తి
* వారం క్రితం దుబాయ్ నుంచి వచ్చిన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపల్లి వాసి
* కామారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
* అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం
* కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలింపు