Remdesivir Black Market : రెమిడెసివిర్ ను బ్లాక్‌లో విక్రయిస్తున్న కేటుగాళ్లు..కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు

రెమిడెసివిర్.. ప్రస్తుతం కరోనా క్రైసిస్‌లో మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న ఇంజెక్షన్ ఇది.. కొందరు కేటుగాళ్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Remdesivir Black Market : రెమిడెసివిర్ ను బ్లాక్‌లో విక్రయిస్తున్న కేటుగాళ్లు..కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు

Remdesivir Black Market

Updated On : April 27, 2021 / 10:20 AM IST

Selling Remdesivir on the Black : రెమిడెసివిర్.. ప్రస్తుతం కరోనా క్రైసిస్‌లో మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న ఇంజెక్షన్ ఇది.. కొందరు కేటుగాళ్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్‌లో దందా సాగిస్తు అమాయకుల నుండి అందిన కాడికి దండుకుంటున్నారు. డమ్మీ ప్రిస్క్రిప్షన్లతో కొనుగోళ్లు చేస్తూ బాధితులకు తిప్పలు తెచ్చి పెడుతున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్ దందాపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

ప్రస్తుతం రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌కు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. కరోనా రోగుల బంధువులు రెమిడెసివిర్ కోసం పరుగులు పెడుతున్నారు. కొంతమంది అయితే ఎంతైనా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక ఫార్మసీ దుకాణాల వద్ద అయితే రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ కోసం పరుగులు పెడుతున్నారు.

రెమిడిసివిర్ కొరతతో కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాని ప్రాధాన్యత దృష్ట్యా ఎక్కడ బ్లాక్ మార్కెట్ లో అమ్మినా.. కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 850 రూపాయల నుండి 3వేలు ఉండే రెమిడిసివిర్ ధరను ఏకంగా బ్లాక్ మార్కెట్లో కేటుగాళ్లు 15 వేల నుండి 25 వేలకు విక్రయిస్తున్నారు.

రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ ఫార్మసీ దుకాణాల్లో కొరత ఏర్పడటంతో మందుల మాఫియా దందాకు తెరలేపాటు కేటుగాళ్లు. ఈ ముఠాలు కరోనా రోగుల అవసరాన్ని అడ్డంపెట్టుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి. ఇంజక్షన్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్న కొందరిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బ్లాక్‌ మార్కెట్‌లో యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను సెంట్రల్‌ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాంపల్లిలో బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని 4 ఇంజక్షన్స్ స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లిలో ఓ ఫార్మసీ షాప్ నడుపుతున్న ముగ్గురు నిందితులు అవసరాన్ని బట్టి రోగుల బంధువులకు 15 వేల రూపాయలకు ఒక రెమెడిసివిర్‌ ఇంజక్షన్ విక్రయిస్తున్నారు.

బ్లాక్ మార్కెట్లో రెమిడి సివియర్ ఇంజక్షన్ ను విక్రయిస్తున్న కేటుగాళ్లు సౌత్ జోన్ లో ముగ్గురు, సెంట్రల్ జోన్ లో ముగ్గురు, నార్త్ జోన్ లో ఒక్కరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజక్షన్ కోసం మెడికల్ షాపు వెళ్లే వారికి ఫలానా దగ్గర లభిస్తుందంటూ రోగుల బంధువులను తిప్పుతూ క్యాష్ చేసుకుంటున్న వారిపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.