ESI-IMS Scam : ఈఎస్ఐ-ఐఎంఎస్‌ స్కాంలో సంచలన విషయాలు..బీనామీ పేర్లతో ముకుందారెడ్డి వ్యాపారాలు

ఈఎస్‌ఐ ఐఎంఎస్‌ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బీనామీ పేర్లతో ముకుందారెడ్డి వ్యాపారాలు చేసినట్లుగా ఈడీ గుర్తించింది.

ESI-IMS Scam : ఈఎస్ఐ-ఐఎంఎస్‌ స్కాంలో సంచలన విషయాలు..బీనామీ పేర్లతో ముకుందారెడ్డి వ్యాపారాలు

Sensational Issues In Esi Ims Scam

Updated On : April 11, 2021 / 9:03 PM IST

Sensational issues in ESI-IMS scam : ఈఎస్‌ఐ ఐఎంఎస్‌ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బీనామీ పేర్లతో ముకుందారెడ్డి వ్యాపారాలు చేసినట్లుగా ఈడీ గుర్తించింది. ప్రమోద్‌ రెడ్డి, వినయ్‌రెడ్డి పేర్ల మీద ముకుందారెడ్డి వ్యాపారాలు చేశారు. డొల్ల కంపెనీలతో మెడికల్‌ పరికరాలు కొనుగోలు చేశారు. తక్కువ ధరకు కొన్న పరికరాలను ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి విక్రయించారు.

దేవికారాణి, ముకుందారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీహరిబాబు కలిసి స్కామ్ చేసినట్లు ఈడీ తేల్చింది. హవాలా, మనీ లాండరింగ్‌తో నిధుల్ని మళ్లించినట్లు నిర్ధారణ అయ్యింది. ఫార్మా కంపెనీలతో పాటు రియల్‌ ఎస్టేట్‌లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. అటు దేవికారాణి తమిళనాడు, కర్నాటక, ఏపీలో భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ఈఎస్‌ఐ ఐఎంఎస్‌ స్కామ్‌ దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. శ్రీనివాస్‌రెడ్డి, ముకుందారెడ్డి, వినయ్‌రెడ్డి, దేవికారాణిలకు సమాన్లు జారీ చేసిన ఈడీ.. పది రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. స్కామ్‌లో ముగ్గురూ కీలక పాత్ర పోషించినట్టు భావిస్తోన్న విచారణ సంస్థ.. బుర్ర ప్రమోద్‌రెడ్డి డొల్ల కంపెనీల వెనుక.. నేతల ప్రమేయంపై ఆధారాలు సేకరిస్తోంది.

ఐఎంఎస్‌ స్కామ్‌తో నగలు, ఆస్తులు కూడబెట్టుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తోంది. అక్రమ సొమ్ముతో కూడబెట్టిన ఆస్తులు అటాచ్‌ చేసేందుకు ఈడీ కసరత్తు మొదలు పెట్టింది.