చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ మీద దాడి చేసింది ఇందుకే.. సంచలన విషయాలు వెలుగులోకి..

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ తీసుకుంది.

చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ మీద దాడి చేసింది ఇందుకే.. సంచలన విషయాలు వెలుగులోకి..

Chilukuri Balaji Temple Chief Priest Rangarajan

Updated On : February 11, 2025 / 10:24 AM IST

Rangarajan: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. రంగరాజన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ రంగరాజన్ ఇంటికి వెళ్లి రంగరాజన్, ఆయన తండ్రి సౌందర రాజన్ ను పరామర్శించారు. మరోవైపు రంగరాజన్ పై దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: Rangarajan Issue: చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి.. ఉపేక్షించం.. వీరిని వదిలిపెట్టం: మంత్రి శ్రీధర్‌ బాబు

రంగరాజన్ పై దాడి ఘటనలో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకోగా.. సోమవారం మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపర్చారు. అయితే, పోలీసుల విచారణలో రంగరాజన్ పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందూ ధర్మ రక్షణ కోసమంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: RSS : చిలుకూరు బాలాజీ పూజారిపై దాడి.. ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన.. మరోసారి ఇలాంటివి..

రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పాత నేరస్తుడని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీర రాఘవరెడ్డిది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. అయితే, అతను గండిపేట మండలం మణికొండలో ఉంటూ 2022లో రామరాజ్యం పేరుతో సంస్థను స్థాపించాడు. సామాజిక మాధ్యమాల్లో శ్లోకాలను పోస్టు చేసి హిందూధర్మ రక్షణకు రామరాజ్యం ఆర్మీలో చేరాలంటూ ప్రజలను ప్రేరేపించాడు. ఇలా రామరాజ్యం ఆర్మీ పేరుతో 25మందిని రిక్రూట్ మెంట్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం పేరుతో వెబ్ సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

రామరాజ్యం ఆర్మీకి మద్దతు ఇవ్వాలని, ఫండింగ్ చేయాలని డిమాండ్ చేశారు. అందుకు రంగరాజన్ ఒప్పుకోకపోవటంతో దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అర్చకుడు రంగరాజన్ పై దాడికేసులో వీర రాఘవరెడ్డితోపాటు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 16మంది కోసం గాలిస్తున్నారు.