Shamshabad airport : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దుబాయ్ విమానానికి హైజాక్ బెదిరింపు.. ముగ్గురు అరెస్ట్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు కలకలం రేపింది. ఈ- మెయల్ ద్వారా బెదిరింపులు వచ్చేసరికి అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. ముగ్గురుని అరెస్ట్ చేశారు.

Shamshabad airport
Shamshabad airport hijack threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు కలకలం రేపింది. ఈ- మెయల్ ద్వారా బెదిరింపులు వచ్చేసరికి అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే AI 951 విమానాన్ని హైజాక్ చేశాం అంటూ ఈ- మెయిల్ వచ్చేసరికి అధికారుల్లో కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుబాయ్ వెళ్లే విమానాన్ని ఆపేసి తనిఖీలు నిర్వహించారు. విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్‌కు తరలించారు.
అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ అది ఫేక్ మెయిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ అది ఫేక్ మెయిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.
తిరుపతి బాదినేని, ఎల్. వినోద్ కుమార్, పి. రాకేశ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుపతి నుంచి బాదినేనిని కలవడానికి ఓ మహిళ వచ్చిందని ఆమె ఎవరు..? వీరు ఎందుకు అటువంటి మెయిల్ పంపించారు..? దానికి కారణమేంటి..? ఏదైనా ప్లాన్ తోనే చేశారా..? లేదా ఆటపట్టింటానికి ఆకతాయితనంగా చేశారా..? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరోవైపు దుబాయ్ వెళ్లే విమాన సర్వీసుల్ని రద్దు చేశారు.
రన్ వే పక్కనే దుబాయ్ విమానాన్ని నిలిపివేశారు. ఈ రోజు సాయంత్రం విమానం దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది. నిందితులు తిరుపతి, వినోద్, రాకేష్ లను అదుపులోకి తీసుకొని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ రోజు సాయంత్రం వేరే ఫ్లయిట్ లో ప్రయాణికులను అధికారులు దుబాయ్ పంపనున్నారు.