ఆ సంస్థకే తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులు

  • Published By: madhu ,Published On : October 29, 2020 / 08:26 AM IST
ఆ సంస్థకే తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులు

Updated On : October 29, 2020 / 10:40 AM IST

Shapoorji Pallonji Bags Contract For TS Secretariat : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ-పల్లొంజీ టెండర్లను దక్కించుకుంది. లార్సెన్ అండ్ టూబ్రో L&T, షాపూర్జీ పల్లోంజీ… ఈ రెండు సంస్థలే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనాన్నినిర్మించేందుకు ముందుకొచ్చాయి. రెండు సంస్థలు మాత్రమే బిడ్ వేసాయి.



అందులో ఎల్‍‌-1గా నిలిచిన షాపూర్జీ-పల్లొంజీకి టెండర్ దక్కింది. సుమారు 800 కోట్ల అంచనా వ్యయంతో కొత్త సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. 12 నెలల లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. షాపూర్జీ-పల్లొంజీ త్వరలో నిర్మాణ పనులను ప్రారంభించనుంది.



https://10tv.in/central-government-key-comments-on-polavaram-project/
షాపూర్జీ-పల్లోంజీకి గుజరాత్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కన్‌స్ట్రక్షన్‌లో మంచి పేరుంది. సెక్రటేరియట్ భవన నిర్మాణం కోసం అక్టోబర్ 7న ప్రభుత్వం ప్రీ బిడ్లను ఆహ్వానించింది. దేశంలో ఎల్ అండ్ టి, షాపోంజీతో పాటూ… టాటా ప్రాజెక్ట్స్, ముంబైలోని జేఎంసీ ప్రాజెక్ట్స్, ఉత్తరప్రదేశ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు… ప్రి బిడ్‌లో పాల్గొన్నాయి.



ఎల్ అండ్ టి, షాపూర్జీ తప్ప… మిగతా కంపెనీలేవీ అక్టోబర్ 20 నాటికి టెండర్ డాక్యుమెంట్లు ఇవ్వలేదు. బిడ్స్ కి అదే చివరితేదీ. ఇక రెండు సంస్థలే పోటీలో ఉండగా తక్కువ రేట్ కోట్ చేసిన షాపూర్జీ-పల్లొంజీ టెండర్ దక్కించుకుంది.