షర్మిల దీక్షకు ముగిసిన గడువు.. భారీగా మోహరించిన పోలీసులు

Sharmilas Fast Deadline For The End Of The Deployment Of A Large Police
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేస్తున్న నిరాహార దీక్షకు పోలీసులు ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ధర్నా చౌక్‌కు పోలీసులు భారీగా చేరుకున్నారు.
72గంటల పాటు దీక్ష చేస్తానని షర్మిల ఇప్పటికే చెప్పగా.. ధర్నా చౌక్ ఖాళీ చేయాలని పోలీసులు షర్మిల అనుచరులకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే షర్మిల దీక్షా శిబిరం వద్ద భారీగా మోహరించారు పోలీసులు.
తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తూ.. వైఎస్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న షర్మిల.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో దీక్షకు దిగారు. దీక్ష సందర్భంగా వైఎస్ షర్మిల యువతకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని, ప్రభుత్వాన్ని విమర్శించారు. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్నారంటూ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.