Fake Doctor : గవ్వలు చేతిలో పెట్టి రోగాన్ని కనిపెట్టేస్తాడట.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కేటుగాడు
గవ్వల వైద్యం పేరుతో పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కేటుగాడి బాగోతం బయటపడింది. మంత్రాలు, భూత వైద్యంతో పేరుతో గవ్వలను చేతిలో పెట్టి రోగాన్ని కనిపెట్టేస్తాడట ఈ కేటుగాడు. ఆర్ఎంపీ డాక్టర్ గా చెలామణి అవుతున్న శ్యామ్ సుందర్..

Fake Doctor : అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం.. ఈ వైద్య విధానాల గురించి అందరికీ తెలిసిందే. అల్లోపతిలో ట్యాబ్లెట్లు ఇస్తారు. హోమియోపతిలో గుళికలు ఇస్తారు. ఇక ఆయుర్వేదంలో పొడి రూపంలో, ద్రవ రూపంలో మందులు ఇస్తారని తెలుసు. కానీ, వీటికి భిన్నంగా గవ్వలతో వైద్యం చేస్తారని మీకు తెలుసా? ఏంటి షాక్ అయ్యారా? గవ్వలతో వైద్యం ఏంటని నివ్వెరపోతున్నారా? అవును.. గవ్వలు చేతిలో పెట్టి రోగాన్ని కనిపెట్టి వైద్యం చేసే వ్యక్తి తెరపైకి వచ్చాడు. తన మాయ మాటలతో అమాయం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాడు. అందినకాడికి డబ్బు దోచుకుంటున్నాడు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో గవ్వలతో వైద్యం చేసే డాక్టర్ వెలిశాడు. గవ్వల వైద్యం పేరుతో పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కేటుగాడి బాగోతం బయటపడింది. మంత్రాలు, భూత వైద్యంతో పేరుతో గవ్వలను చేతిలో పెట్టి రోగాన్ని కనిపెట్టేస్తాడట ఈ కేటుగాడు. ఆర్ఎంపీ డాక్టర్ గా చెలామణి అవుతున్న శ్యామ్ సుందర్.. గవ్వల వైద్యం పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నాడని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
పదో తరగతి మాత్రమే చదివిన శ్యామ్ సుందర్..ఆర్ఎంపీ డాక్టర్ అవతారం ఎత్తి.. ఎంబీబీఎస్ వైద్యుడి తరహాలో వైద్యం అందిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. బినామీ పేరుతో మందుల షాపు, రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాడు. ప్రాథమిక చికిత్సకు పరిమితం కావాల్సిన ఆర్ఎంపీ.. ఎంబీబీఎస్ రేంజ్ లో ఇష్టం వచ్చినట్లు వైద్యం చేస్తున్నాడని, యాంటీ బయాటిక్స్ ఎడా పెడా వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.