Doctor left bandage inside body: ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వలిదేసిన డాక్టర్.. మహిళ మృతి

ఓ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడు ఆమె కడుపులో బ్యాండేజ్ వలిదేశాడు. దీంతో ఆ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. తన భార్య ఆపరేషన్ చేయించుకోవడానికి స్థానికంగా ఉండే ఆసుపత్రిలో చేరిందని బాధితురాలి భర్త మీడియాకు తెలిపాడు.

Doctor left bandage inside body: ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వలిదేసిన డాక్టర్.. మహిళ మృతి

Alabama shooting

Doctor left bandage inside body: ఓ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడు ఆమె కడుపులో బ్యాండేజ్ వలిదేశాడు. దీంతో ఆ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. తన భార్య ఆపరేషన్ చేయించుకోవడానికి స్థానికంగా ఉండే ఆసుపత్రిలో చేరిందని బాధితురాలి భర్త మీడియాకు తెలిపాడు.

ఆపరేషన్ చేసిన వైద్యుడు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అతడు చెప్పాడు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో తన భార్య కడుపులో బ్యాండేజ్ పెట్టాడని అది అలాగే వదిలేసి కుట్లు వేశాడని వివరించాడు. ఈ ఘటనతో బాధితుడి బంధువులు, స్థానికులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీసిన వైద్యుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పి. బాధితుడికి న్యాయం చేస్తామని అన్నారు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని సర్కిల్ ఆఫీసర్ విజయ్ రాణా మీడియాకు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. డబ్బుపైనే దృష్టి పెడుతున్న కొందరు డాక్టర్లు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

Road Accident Six Died : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు సహా ఆరుగురు మృతి