TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో 36 మంది నిందితులపై చార్జ్ షీట్

పేపర్ కొనుగోలు, అమ్మకాల ద్వారా ఈ వ్యవహారంలో రూ.1.63 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి సేకరించిన ఆధారాలను సీచ్ చేసి రామంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరికి పంపినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో 36 మంది నిందితులపై చార్జ్ షీట్

TSPSC paper leak (3)

Updated On : June 10, 2023 / 4:42 PM IST

SIT preliminary chargesheet : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కేసులో 36 మంది నిందితులపై కోర్టులో సిట్ ప్రాథమిక చార్జ్ షీట్ దాఖలు చేసింది. 98 పేజీల చార్జ్ షీట్ లో 49 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపింది. ప్రశ్నా పత్రాల క్రయవిక్రయాల్లో రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. ఈ మేరకు సిట్ అధికారులు పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు న్యూజిలాండ్ లో ఉన్న ఒక నిందితుడు మినహా 49 మందిని
సిట్ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో 16 మంది దళారులు కాగా, మిగిలిన వారు వివిధ పరీక్షలు రాసిన వారుగా గుర్తించారు. 90 రోజులు పూర్తికాకముందే సిట్ అధికారులు కోర్టుకు చార్జ్ షీట్ దాఖలు చేయడంతో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి బెయిల్ మంజూరుపై సందిగ్దత నెలకొంది. ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన మధ్యవర్తులు నేరుగా ఆయా పోటీ పరీక్షలకు సంబంధించిన
ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారు.

Kerala to Mecca: 8,600 కి.మీ, 370 రోజులు, 6 దేశాలు.. కేరళ నుంచి మక్కాకు కాలినడకన సాగిన ఓ వ్యక్తి అద్భుతమైన ప్రయాణం

పేపర్ కొనుగోలు, అమ్మకాల ద్వారా ఈ వ్యవహారంలో రూ.1.63 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి సేకరించిన ఆధారాలను సీచ్ చేసి రామంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరికి పంపినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం కోర్టులో ప్రాథమిక చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు.

వరంగల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ పూల రమేశ్ కుమార్ సహా పరీక్షా కేంద్రంలోకి చాట్ జీపీటీ
సహకారంతో సమాధానాలు గుర్తించిన ఎమ్ ప్రశాంత్ అలియాస్ చంటి, బీ మహేశ్, వీ నరేశ్ లోతపాటు ఏఈ పేపర్ కొనుగోలు చేసిన జీ శ్రీనివాస్ నాయక్ విధించిన ఆరు రోజుల కస్టడీ శుక్రవారం పూర్తికావడంతో 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చారు. ఐదుగురిని మళ్లీ జ్యూడీషియల్ కస్టడీకి తరలిస్తూ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ఉత్తర్వులు జారీ చేశారు.