Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రోరైలు దిగి స్కైవాక్ ద్వారా మీ ఇంటికెళ్లొచ్చు..

మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా ప్రయాణికులు సులభంగా మెట్రో స్టేషన్లకు చేరుకునేలా, స్టేషన్ల నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలా ..

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రోరైలు దిగి స్కైవాక్ ద్వారా మీ ఇంటికెళ్లొచ్చు..

Hyderabad Metro

Updated On : February 28, 2025 / 10:10 AM IST

Hyderabad: మెట్రో సంస్థ వినూత్న పద్దతిలో ఆలోచిస్తుంది. తద్వారా ప్రయాణీకులను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో నివాసదారులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతోపాటు.. వారికి రవాణా మార్గాన్ని తేలిక చేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మెట్రోతో రియల్ సంస్థలు చర్చలు జరిపి.. మెట్రో స్టేషన్ నుంచి తమ అపార్ట్మెంట్ వరకు స్కైవాక్ లు నిర్మించుకుంటున్నాయి. ఇందుకు మెట్రో అనుమతులు ఇస్తుండటంతో ఈ విధానం క్రమంగా పెరుగుతోంది.

Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై డౌట్స్ ఉన్నాయా..? మీకో అప్డేట్..

ఇప్పటికే గతేడాది నవంబర్ నెలలో మెట్రో పర్మిషన్ తో కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ మాల్ మెట్రో స్టేషన్ నుంచి నేరుగా స్కైవాక్ నిర్మించుకున్న విషయం తెలిసిందే. దీంతో మెట్రో దిగిన వెంటనే స్కేవే ద్వారా మాల్ లోకి వెళ్లొచ్చు. తాజాగా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న భారీ హౌసింగ్ కమ్యూనిటీకి మెట్రో స్టేషన్ నుంచి స్కైవాక్ నిర్మించుకోవడానికి అనుమతులిచ్చింది. దీంతో సదరు కన్ స్ట్రక్షన్ కంపెనీ సొంత ఖర్చుతో స్కైవాక్ నిర్మించుకోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఇది పూర్తయితే ఆ టవర్లలో ఉండే ప్రజలు ఇంటి నుంచి నేరుగా మెట్రో స్టేషన్ కు, మెట్రో రైలు దిగిన వెంటనే సరాసరి ఇంటికి వెళ్లిపోవచ్చు.

Also Read: Telangana: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. నాన్ లోకల్ కోటా ఎత్తివేత.. స్టూడెంట్స్ కు జరిగే లాభం ఇదే..

మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా ప్రయాణికులు సులభంగా మెట్రో స్టేషన్లకు చేరుకునేలా, స్టేషన్ల నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలా పలుచోట్ల విశాలమైన స్కైవాక్ లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. నాగోల్ – ఎయిర్ పోర్ట్ రూట్ లో కొత్తగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రో స్టేషన్ ను ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్ కి దగ్గరలో ఎల్బీ నగర్ వైపు నిర్మించనున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ రెండు స్టేషన్లను కలుపుతూ విశాలమైన స్కైవాక్ నిర్మించాలని నిర్ణయించారు.

 

ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో సాలార్ మ్యూజియం, చార్మినార్ సమీపంలో నుంచే మెట్రో వెళ్లనుంది. అందుకోసం ఆయా ప్రాంతాల్లో రెండు మెట్రో స్టేషన్ల నిర్మాణం జరగనుంది. ఈ రెండు స్టేషన్ల సమీపంలో నుంచి సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్ కు వెళ్లడానికి విశాలమైన స్కైవాక్ లను నిర్మించనున్నారు. ఇలా రాబోయే కాలంలో మెట్రో రైలు దిగిన వెంటనే మెట్రో స్టేషన్ బయటకు రాకుండా నేరుగా స్కైవాక్ ల ద్వారా అపార్ట్ మెంట్లు, షాపింగ్ మాల్స్, మ్యూజియం, ప్రముఖ ప్రదేశాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది.