ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనలో స్వల్పమార్పులు

  • Published By: bheemraj ,Published On : November 27, 2020 / 07:13 PM IST
ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనలో స్వల్పమార్పులు

Updated On : November 27, 2020 / 7:23 PM IST

PM Modi Hyderabad Tour : ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనలో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం రేపు మధ్యాహ్నం 3గంటల తర్వాత హైదరాబాద్ రావాల్సిన ప్రధాని రేపు మధ్యాహ్నం ఒంటిగంటకే హైదరాబాద్ చేరుకుంటారు.



ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని అక్కడ్నుంచి భారత్ బయోటెక్ సంస్థకు చేరుకుంటారు. కోవాగ్జిన్ తయారీ, పనితీరుపై క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడనున్నారు.



తర్వాత మధ్యాహ్నం 3గంటలకు హకీంపేట నుంచి ఆయన పుణె వెళ్లనున్నారు. అక్కడ సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శిస్తారు. హైదరాబాద్ రావడానికంటే ముందే ఆయన అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శిస్తారు.