పాలస్తీనాపై దాడిని ఖండిస్తున్నాం.. ఖమ్మంలో సంఘీభావ ర్యాలీ

యుద్ధం వద్దు.. శాంతి ముద్దు అంటూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ.. పాలస్తీనాకు మద్దతుగా ఖమ్మం నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు.

పాలస్తీనాపై దాడిని ఖండిస్తున్నాం.. ఖమ్మంలో సంఘీభావ ర్యాలీ

Solidarity rally in Khammam

Updated On : August 7, 2025 / 2:01 PM IST

Solidarity rally in Khammam: యుద్ధం వద్దు.. శాంతి ముద్దు అంటూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ.. పాలస్తీనాకు మద్దతుగా అఖిలపక్ష పార్టీలు, విద్యార్థులు, పౌర సమాజం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుండి జడ్పీ సెంటర్ వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. గాజాలో చిన్నారుల మృతి, ఆకలి కేకలను తెలియజేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.