Rajanna Sirisilla : ఫీటున్నర స్థలం కోసం కొడుకు, కోడలు వేధింపులు.. తట్టుకోలేక పురుగుల మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్య
పాత ఇంటి వెనుక పెద్ద కొడుకు ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. పాత ఇంటి స్థలం నుంచి పెద్ద కొడుకుకు ఫీటున్నర స్థలం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇల్లు కూల్చివేసి ఇవ్వాలని అతను తల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు.

old couple kill
Rajanna Sirisilla Old Couple Kill : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫీటున్నర స్థలం కోసం కొడుకు, కోడలి వేధింపులను తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందుపర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కనికరపు దేవయ్య(69), లక్ష్మీనర్సవ్వ(60) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
పాత ఇంటి వెనుక పెద్ద కొడుకు ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. పాత ఇంటి స్థలం నుంచి పెద్ద కొడుకుకు
ఫీటున్నర స్థలం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇల్లు కూల్చివేసి ఇవ్వాలని అతను తల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో శనివారం తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి మల్లన్న దేవుడిని తీసుకెళ్తామని, ఇల్లు కూల్చివేయాలని తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు.
Tirupati : తీవ్ర విషాదం.. అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య, పెళ్లి చేసుకుని ఆ తర్వాత
దీంతో మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు శనివారం రాత్రి తలుపులు వేసుకుని ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి దిగి చూసేసరికి దంపతులు విగతజీవులై పడి ఉన్నారు. ఒకే చితిపై దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న కొడుకు మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.