Special Trains : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు.. సెప్టెంబర్ 3వ తేదీ వరకు..
Special Rrains : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది..
special trains
- దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
- హైదరాబాద్-మంగళూరు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
- ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు
Special Trains : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.. ఈ క్రమంలో హైదరాబాద్ – బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో ఐదు ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు తాజాగా రైల్వే అధికారులు ప్రకటించారు.
Also Read : Aadhaar Services Down: నిలిచిపోనున్న ఆధార్ సేవలు.. యూజర్లకు అలర్ట్.. కారణం ఏంటంటే?
వేసవి సెలవుల సమయంలో ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడిపింది. అయితే, ప్రస్తుతం సైతం ఈ ప్రత్యేక రైళ్లకు డిమాండ్ కొనసాగుతుండటంతో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు నడుస్తాయి.
హైదరాబాద్ – మంగళూరు సెంట్రల్ (నం.07097) ఆగస్టు 5, 12, 19, 26 తేదీల్లో ప్రతి బుధవారం హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. అదేవిధంగా మంగళూరు సెంట్రల్ – హైదరాబాద్ (నం. 07098) ప్రత్యేక రైలు ఆగస్టు 6, 13, 20, 27, సెప్టెంబర్ 3వ తేదీల్లో ప్రతి గురువారం మంగళూరు నుంచి ప్రారంభం అవుతుంది.
ఈ రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, గుంతకల్, అనంతపురం, యలహంక, కృష్ణరాజపురం, సేలం, పాలక్కాడ్, కోళికోడ్, వడకర, కాసర్ గోడ్ తదితర స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
