కొరియన్ గ్లోబల్ కంపెనీలతో సీఎం రేవంత్ చర్చలు.. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో కొరియన్ కంపెనీల పెట్టుబడులు..!

టెక్స్ టైల్ రంగ విస్తృతికి తెలంగాణ సర్కార్ తీసుకున్న ప్రత్యేక కార్యాచరణను సీఎం రేవంత్ వారికి వివరించారు.

కొరియన్ గ్లోబల్ కంపెనీలతో సీఎం రేవంత్ చర్చలు.. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో కొరియన్ కంపెనీల పెట్టుబడులు..!

Korea Investments In Warangal : వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో కొరియా టెక్స్ టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా పలు గ్లోబల్ కంపెనీల అధినేతలు, బిజినెస్ గ్రూపులతో సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశాలు, చర్చలు జరిపారు. టెక్స్ టైల్ రంగ విస్తృతికి తెలంగాణ సర్కార్ తీసుకున్న ప్రత్యేక కార్యాచరణను సీఎం రేవంత్ వారికి వివరించారు. వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను కంపెనీలకు సీఎం రేవంత్ వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ పిలుపుతో పలు సంస్థలు వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.

సీఎం రేవంత్ టీమ్ సౌత్ కొరియా పర్యటన కొనసాగుతోంది. యుయు ఫార్మా ప్రతినిధులతో సీఎం బృందం భేటీ అయ్యింది. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక రేపు సాయంత్రం రేవంత్ టీమ్ దక్షిణ కొరియా నుంచి సింగపూర్ కి వెళ్లనుంది. ఎల్లుండి హైదరాబాద్ కు తిరిగి రానుంది రేవంత్ టీమ్. అమెరికాలో 8 రోజుల పాటు పర్యటించిన సీఎం రేవంత్ టీమ్.. దాదాపు 50 వాణిజ్య సంస్థలతో సంప్రదింపులు జరిపింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, డల్లాస్, వేగాస్, టెక్సాస్, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని కంపెనీల ప్రతినిధులో భేటీ అయ్యారు. తెలంగాణ బ్రాండ్ వివరిస్తూ తమ ప్రభుత్వ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ప్రజంటేషన్ ఇచ్చారు. అమెరికాలో దాదాపు 31వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. గూగుల్, అమెజాన్ సహా పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో సుమారు 30వేల 750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి.

Also Read : కాంగ్రెస్‌లో పదవుల జాతర.. పార్టీ, క్యాబినెట్, నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నది వీరే..