ఆషాడమాసం బోనాల ఉత్సవాలు షురూ.. నెల రోజులు నగరంలో సందడే సందడి ..
ఆషాడమాసం బోనాల సంబురాలు గురువారం నుంచి మొదలయ్యాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ..

Golconda Bonalu 2025
Golconda Bonalu 2025: హైదరాబాద్ ఆషాడ బోనాల సంబురాలు గురువారం నుంచి మొదలయ్యాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి నెలరోజుల పాటు జరిగే ఆషాడ మాస బోనాలతో నగరంలో సందడి వాతావరణం నెలకొననుంది.
లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాలు మొదలవుతాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున మధ్యాహ్నం 12గంటలకు గోల్కొండలోని అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేశ్, పొన్నం ప్రభాకర్ లు సమర్పించనున్నారు.
మరోవైపు ఇవాళ్టి నుంచి ప్రతి గురువారం, ప్రతి ఆదివారం గోల్కొండ అమ్మవారికి మొత్తం తొమ్మిది బోనాలు సమర్పిస్తారు. గురువారం సమర్పించే తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఆ తరువాత నగరమంతా బోనాల నిర్వహించాక చివరకు జులై 24న సమర్పించే తొమ్మిదవ బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇదిలాఉంటే.. జులై 13 నజరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ప్రతి గురు, ఆదివారాల్లో గోల్కొండ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
మొదటి పూజ: జూన్ 26
రెండో పూజ : జూన్ 29
మూడో పూజ : జులై 3
నాల్గో పూజ : జులై 6
ఐదో పూజ : జులై 10
ఆరో పూజ : జులై 13
ఏడో పూజ : జులై 17
ఎనిమిదో పూజ : జులై 20
తొమ్మిదో పూజ : జులై 24