మెరుగైన సేవల కోసం ఇన్ని యాప్‌లను తీసుకువచ్చాం: మంత్రి శ్రీధర్ బాబు

తమ పోలీసు యంత్రాంగం డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని విద్యార్థులకు డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తోందని తెలిపారు.

మెరుగైన సేవల కోసం ఇన్ని యాప్‌లను తీసుకువచ్చాం: మంత్రి శ్రీధర్ బాబు

Duddilla Sridhar Babu

Updated On : December 8, 2024 / 5:19 PM IST

కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల గురించి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ప్రజలకు సంబంధించిన విజయోత్సవాలని అన్నారు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఏ విధంగా ఉపయోగ పడుతుంది అనే యాప్ విడుదల చేసుకున్నామని తెలిపారు. 30 రోజులు పట్టే లోన్ 2 రోజుల్లోనే లోన్ రైతులు తీసుకోవచ్చని చెప్పారు.

తమ పోలీసు యంత్రాంగం డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని విద్యార్థులకు డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తోందని తెలిపారు. సాంకేతికతను ఉపయోగించుకొని స్కిల్స్ పెంచుకునే విధంగా మిత్ర యాప్ వాడుతున్నట్లు చెప్పారు. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలని ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతుందని అన్నారు.

మహిళలకు పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ రోజు మూడు ప్రధానమైన సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, జవాబుదారీ తనంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించాలని కొత్త క్రెడిట్ సర్వీసును ప్రారంభించామని తెలిపారు.

వ్యవసాయానికి టెక్నాలజీ జోడిస్తూ స్మార్ట్ అగ్రీ యాప్‌ను తీసుకొచ్చామని అన్నారు. రైతుల రుణమాఫీ, మద్దతు దగ్గర, బోనస్, రుణాలకు సంబంధించి స్మార్ట్ అగ్రీ క్రెడిట్ HDFC సర్వీస్ ఉపయోగపడుతుందని చెప్పారు. మిత్ర యాప్ ద్వారా విద్యార్థుల మీద డ్రగ్స్ ప్రభావం స్థితిగతులను తెలుసుకొని ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 6 నెలల్లో అన్ని గ్రామాలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామన్నారు.

బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం