Srihari Rao : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ అసంతృప్తి నేత శ్రీహరి రావు?

ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలవకపోవడంతో శ్రీహరి రావును అలిగారు. సీఎం కేసీఆర్ కి ఉద్యమ సమయంలో అత్యంత సన్నిహితుడిగా శ్రీహరి రావు ఉన్నారు.

Srihari Rao : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ అసంతృప్తి నేత శ్రీహరి రావు?

Srihari Rao

BRS Disgruntled Leader Srihari Rao  : బీఆర్ఎస్ అసంతృప్తి నేత శ్రీహరి రావు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య అనుచరులతో శ్రీహరి రావు సమావేశం నిర్వహించారు. జూన్ 17 తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం. శ్రీహరి రావు.. కార్యకర్తలు, అభిమానుల సలహాలను తీసుకుంటున్నారు.

ఇటీవల నిర్మల్ లో జరిగిన సీఎం కేసీఆర్ కార్యక్రమానికి శ్రీహరి రావు దూరంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ కి సన్నిహితునిగా, బీఆర్ఎస్ ముఖ్య నేతగా శ్రీహరి రావు ఉన్నారు. అయితే, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహార శైలితో శ్రీహరి రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

TS High Court : ‘ఇదో పబ్లిక్‌ న్యూసెన్స్‌’ పిటిషన్‌.. హరిరామ జోగయ్యపై టీఎస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఒకప్పుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా శ్రీహరి రావు ఉన్నారు. శ్రీహరి రావు.. 2007లో టీఆర్ఎస్ లో చేరారు. ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలవకపోవడంతో శ్రీహరి రావును అలిగారు. సీఎం కేసీఆర్ కి ఉద్యమ సమయంలో అత్యంత సన్నిహితుడిగా శ్రీహరి రావు ఉన్నారు.

గత బహిరంగ సభల్లో ప్రతిసారి శ్రీహరి రావుతో ఉన్న తన అనుబంధాన్ని కేసీఆర్ పంచుకున్నారు. శ్రీహరి రావుతో గతంలో బీజేపీ నేతలు సైతం చర్చలు జరిపారు. మరికాసేపట్లో కాంగ్రేస్ లో చేరే తేదీని శ్రీహరి రావు ప్రకటించనున్నట్టు సమాచారం.