TS High Court : ‘ఇదో పబ్లిక్‌ న్యూసెన్స్‌’ పిటిషన్‌.. హరిరామ జోగయ్యపై టీఎస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ తర్వగా పూర్తి చేసేలా చూడాలని హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేశారు.

TS High Court : ‘ఇదో పబ్లిక్‌ న్యూసెన్స్‌’ పిటిషన్‌.. హరిరామ జోగయ్యపై టీఎస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Telangana High Court

Harirama Jogaiah Petition : మాజీ ఎంపీ హరిరామ జోగయ్యకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హరిరామ జోగయ్యపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం చేసింది. ‘ఇదో పబ్లిక్‌ న్యూసెన్స్‌’ పిటిషన్‌ అని హరిరామ జోగయ్య పిటిషన్ పై హైకోర్టు మండిపడింది. అసలు ఇందులో ‘పబ్లిక్‌ ఇంట్రస్ట్‌’ ఏముంది? అని ప్రశ్నించింది. వ్యక్తిగత కక్షతోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు కనిపిస్తోందని పేర్కొంది.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ తర్వగా పూర్తి చేసేలా చూడాలని హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేశారు. అలాంటివి చేయకుండా రాష్ట్రపతి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా… ఇది ఏం పద్ధతి అంటూ హైకోర్టు సీరియస్ అయింది. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కిందిస్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపింది.

TDP MLC Ashok Babu: జగన్ పిల్లలకు మేనమామ కాదు.. దొంగ మామ..

“ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్‌ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్‌లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉంది అని మీకన్నా అనిపిస్తోందా? వ్యవగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృథా చేయవద్దు” అని సూచించింది.
ఈ మధ్య తెలంగాణ గవర్నర్‌ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్‌ న్యూసెన్స్‌ కేసులు ఎక్కువయ్యాయని అసహనం వ్యక్తం చేసింది. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారిందని పేర్కొంది. “మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేం” అని హైకోర్టు స్పష్టం చేసింది.

2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐ కోర్టుకు ఆదేశించాలని జోగయ్య పిటిషన్ వేశారు. ఈ పిల్‌ పై అభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ కేసు నెంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఫైలింగ్‌ నెంబర్ పైనే విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేట్టింది.

Janasena State Office : జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ హోమం.. పార్టీ నేతలకు లేని ఆహ్వానం

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధం కాగా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు కాలాన్ని వృథా చేసేందుకు ప్రయత్నించారని మండిపడింది. రిజిస్ట్రి అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషన్‌కు ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను జూలై 6కు వాయిదా వేసింది.