ఓరి వీళ్ల దుంపతెగ.. బిచ్చగాళ్లనూ వదల్లేదు..! బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ వీడియోలు చూపించి.. ‘సృష్టి’ దారుణాలు..
సరోగసి పేరుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

beggars Sperm
Srushti Test Tube Center Case: సరోగసి పేరుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ రేటుకు కొనుగోలు చేసి సంతానం లేని వారికి లక్షల్లో అమ్ముకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు.. బిచ్చగాళ్లనుసైతం వీళ్లు వదల్లేదు.. వారికి బిర్యానీ, బీరు ఇచ్చి.. పోర్న్ వీడియోలు చూపించి వారి వీర్యాన్ని సేకరించేవారని తెలిసింది.
‘సృష్టి’ కేసులో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతోపాటు పలువురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు.. సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎప్, సరోగసీ కేసుల రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ద్వారా ఐవీఎఫ్, సరోగసీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు.
కూకట్ పల్లి, కొండాపూర్ ప్రాంతాలతోపాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణంతోపాటు ఒడిశా, కోల్‌కతాలోనూ వీరి బ్రాంచ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సృష్టి నిర్వాహకులు బిచ్చగాళ్లనుసైతం వదల్లేదు.
సికింద్రాబాద్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లు, అమాయకులను ముందుగా గుర్తించి.. వారికి డబ్బులు, బీరు, బిర్యానీ ఆశచూపించి.. పోర్న్ వీడియోలు చూపించి వీరి వీర్యాన్ని సేకరించేవారని తెలుస్తోంది. అంతేకాదు.. రోజువారీ కూలీలు, పేదరికంతో బాధపడుతున్న దంపతులు, యువకులను గుర్తించి.. వారి నుంచి వీర్యం సేకరించి రూ.800 నుంచి రూ. 4వేల వరకు ఇచ్చేవాళ్లు. వీరికి కూడా పోర్న్ వీడియోలు చూపిస్తూ వీర్యం శాంపిల్స్ సేకరించేవారని సమాచారం.
అండం ఇచ్చే మహిళలకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు నగదు రూపంలో ఇచ్చేవారని, వీర్యం, అండాలను అహ్మదాబాద్ కు తరలించేవారని సమాచారం. మొత్తానికి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.