Sandhya Theatre : హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట.. ఒకరు మృతి.. అల్లు అర్జున్ రావడంతో..

అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.

Sandhya Theatre : హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట.. ఒకరు మృతి.. అల్లు అర్జున్ రావడంతో..

Updated On : December 5, 2024 / 1:54 AM IST

Sandhya Theatre : హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఒక ప్రాణం తీసింది. ఈ తొక్కిసలాటలో ఒక మృహిళ మృతి చెందింది. మృతురాలిని దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతిగా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట ఘటనలో ఒక బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పుష్ప-2 బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చాడు. అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది.

పుష్ప2 సినిమా చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో సంధ్య థియేటర్ కు వచ్చారు. అదే సమయంలో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్ కు వెళ్లారు. అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒక మహిళ, ఒక బాలుడు ఉన్నారు. కాగా, మహిళ చనిపోవడం విషాదం నింపింది.

 

Also Read : ‘పుష్ప 2’ మూవీ రివ్యూ.. వైల్డ్‌ఫైర్ ఎంటర్‌టైనర్.. అవార్డులన్నీ అల్లు అర్జున్‌కే.. సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ రివ్యూ!