Pink Power Run : బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ.. సెప్టెంబర్ 29న ‘పింక్ ఫర్ రన్’
సుధారెడ్డి ఫౌండేషన్, ఎం.ఇ.ఐ.ఎల్(MEIL) ఫౌండేషన్ లు సామాజిక సేవతో పాటు సహకారం అందించటంలో ఎల్లప్పుడూ ముందుంటాయి.

Sudha Reddy Foundation Meil Foundation To Organize Pink Power Run 2024
Pink Power Run : సుధారెడ్డి ఫౌండేషన్, ఎం.ఇ.ఐ.ఎల్(MEIL) ఫౌండేషన్ లు సామాజిక సేవతో పాటు సహకారం అందించటంలో ఎల్లప్పుడూ ముందుంటాయి. తాజాగా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఈ రెండు సంస్థలు సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. ‘పింక్ పవర్ రన్ 2024’ పేరుతో సెప్టెంబర్ 29వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని.. క్యాన్సర్ పై చేసే పోరాటంలో ఐక్యతను ప్రదర్శించాలని రెండు ఫౌండేషన్లు కోరాయి.
మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ పింక్ పవర్ రన్‌ను ప్రారంభించినట్లు సుధారెడ్డి ఫౌండేషన్ ఫౌండర్ సుధారెడ్డి తెలిపారు. తొలి ఎడిషన్‌లో భాగంగా 3k, 5k, 10k రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
హైడ్రా దూకుడు.. ఇప్పటివరకు ఎన్ని అక్రమ కట్టడాలు కూల్చేశారంటే..
ఈ పింక్ మారథాన్ లో పాల్గొనే ఔత్సాహికులకు ప్రత్యేక రేస్ కిట్లు, పోషకాహారం అందజేయనున్నారు. అంతే కాకుండా రేస్ కు ముందు, తర్వాత చేయాల్సిన వ్యాయామ చిట్కాలను కూడా చెబుతారు. రేసును విజయవంతంగా పూర్తి చేసిన వారికి మెడల్స్ అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో వేలాది మందిని భాగస్వామ్యం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. పిల్లల నుంచి నుండి పెద్దల వరకు ఉండేలా చూడనున్నారు. గులాబీ రంగు దుస్తులను ధరించి పక్షి రూపంలో భారీ మానవహారాన్ని ప్రదర్శించనున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ పక్షిరూప మానవహారం అనేది ఐక్యతా, ఆశ, బ్రెస్ట్ క్యాన్సర్ పై పోరాడే విషయంలో నిబద్ధతకు సంకేతమని నిర్వాహకులు తెలిపారు.