Met Gala 2021: న్యూయార్క్ ఫ్యాషన్ షోలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి సతీమణి!
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన..

Met Gala 2021
Met Gala 2021: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా-2021’ (Met Gala 2021)లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిశారు.
PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!

Met Gala 2021
ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈఏడాది భారత్ నుంచి పాల్గొన్నది ఆమె ఒక్కరే కావడం గమనార్హం. ఈ ఏడాది థీమ్ ‘అమెరికన్ ఇండిపెండెన్స్’కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫల్గుని, షేన్ పీకాక్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు.
Akkineni Heroes: బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని సినిమాలు.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్!

Met Gala 2021
దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు డిజైనర్లు తెలిపగా.. మెట్ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి. ఫాల్గుని షేన్ నెమలి గౌనులో సుధారాణి రెడ్ కార్పెట్ అరంగేట్రం చేయగా.. ఇది అమెరికన్ జెండా రంగులతో స్ఫూర్తి పొందింది. ఇది 4-మీటర్ల మెటాలిక్ మరియు అమెరికన్ జెండా రంగులతో డిజైన్ చేశారు.