Surabhi Vanidevi : ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ప్రమాణ స్వీకారం

దివంగత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కూతురు సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు.

Surabhi Vanidevi : ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ప్రమాణ స్వీకారం

Vanidevi

Updated On : August 29, 2021 / 7:57 PM IST

graduate mlc Surabhi Vanidevi : దివంగత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కూతురు సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం (ఆగస్టు 29, 2021) శాసనమండలిలోని తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. వాణీదేవితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. రాజకీయ వాతావరణంలో పెరిగామని చెప్పారు.

ప్రజాసేవ చేయడానికి పదవి అక్కర్లేదని అనుకున్నా.. కానీ అధికారం ఉంటే ఎక్కువ సేవ చేయొచ్చని భావించానని పేర్కొన్నారు. తనకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేకే, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌ నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి మార్చిలో జరిగిన ఎన్నికల్లో సురభి వాణీదేవి.. టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై విజయం సాధించారు. వాణీదేవికి 1,89,339 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 1,37,566 ఓట్లు వచ్చాయి.