వారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాను: సంచలన విషయాలు తెలిపిన ప్రణీత్ రావు

Praneet Rao: ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశానని తెలిపారు.

వారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాను: సంచలన విషయాలు తెలిపిన ప్రణీత్ రావు

Updated On : March 14, 2024 / 1:11 PM IST

Dugyala Praneeth Rao: తెలంగాణలో ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన కీలక సమాచారాన్ని వెల్లడించినట్టు తెలిసింది. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పినట్టు సమాచారం.

ఫోన్ టాపింగ్ చేసి, ఆ సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చానని పోలీసుల విచారణలో ప్రణీత్ రావు వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ వారి ఫోన్లను ట్యాప్ చేశానని.. తనపై ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబీ చీఫ్ కి సమాచారం ఇచ్చానని ఆయన చెప్పినట్టు సమాచారం.

కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశానని తెలిపారు. అనేక మంది అధికారులు, ప్రజా ప్రతినిధుల వాట్సాప్ లపై నిఘా పెట్టానని ప్రణీత్ రావు చెప్పారు. అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేశానని తెలిపారు. సెల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, పత్రాలను వేల సంఖ్యలో ధ్వంసం చేశానని చెప్పారు.

కాగా, ప్రణీత్ రావును మరోసారి విచారించేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు. కాగా, ఎస్ఐబీ మాజీ చీఫ్ తో పాటు ఎస్పీ, డీఎస్సీని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు.

 Also Read: కేసీఆర్‌కు ఆరూరి రమేశ్‌ షాక్.. బీజేపీలో చేరడానికి ఢిల్లీకి పయనం