Komatireddy Rajagopalreddy: రేవంత్ తో విబేధాలు లేవన్న రాజగోపాల్ రెడ్డి

తనకు వ్యక్తిగతంగా రేవంత్ తోకాని మరే ఇతర నాయకులతో నాకు విభేదాలు లేవని సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Komatireddy Rajagopalreddy: రేవంత్ తో విబేధాలు లేవన్న రాజగోపాల్ రెడ్డి

Rajagopal

Updated On : March 11, 2022 / 2:53 PM IST

Komatireddy Rajagopalreddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు, పార్టీ రాష్ట్ర అధిష్టానానికి మధ్య పొంతన కుదరలేదం లేదంటూ వస్తున్న వార్తలపై సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రేవంత్ తో విబేధాలు లేవంటూనే పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తపరిచారు రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా రేవంత్ తోకాని మరే ఇతర నాయకులతో నాకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణంగానే తాను గాంధీ భవన్ కు వెళ్లడం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు పార్టీ పగ్గాలు ఇస్తే ఎలాంటి ఇండికేషన్ ఇచ్చినట్లు? అంటూ పరోక్షంగా రేవంత్ నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పార్టీ పగ్గాలను ఎలాంటి వ్యక్తులకు ఇస్తున్నామని విషయాన్నీ అధిష్టానం చూసుకోవాలని రాజగోపాల్ అన్నారు.

Also read:Yashoda Hospital : సీఎం కేసీఆర్‌‌కు వారం పాటు విశ్రాంతి అవసరం.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

నిజాయితీ పరులు..తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వారికి పగ్గాలు ఇస్తే బాగుందని.. ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి ని నిలబెడితే.. క్రెడిబులిటీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. “రేవంత్ మీద ఎటువంటి కోపం వ్యతిరేకత లేదు..అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టడం లేదు. నా బాధంతా.. తెలంగాణ కోసం కష్టపడిన వారికి ఇస్తే పార్టీకి మరింత బలం చేకూర్చినట్లు ఉండేది” అంటూ రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ తరుపున గెలిచే ఎమ్మెల్యేలను నిలబెట్టగలిగే నాయకుడు లేడని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా కొట్లాడారో.. ఇప్పుడు టీ.ఆర్.ఎస్ ను గద్దె దింపేవరకు అలాగే కొట్లాడాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also read: CM Jagan : కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ