Tandoori chicken : తందూరీ చికెన్‌ తెచ్చిన తంటా..రెస్టారెంట్‌ సీజ్‌

ఓ నాన్‌వెజ్‌ ప్రియుడు అందరిలాగే రెస్టారెంట్‌కు వెళ్లాడు. నచ్చిన చికెన్‌ ఐటమ్‌ ఆర్డర్ ఇచ్చాడు. ఎంతో ఇష్టంగా ఆరగిద్దామని అనుకునేంతలో కోపం తెప్పించే అనుభవం ఎదురైంది.

Tandoori chicken : తందూరీ చికెన్‌ తెచ్చిన తంటా..రెస్టారెంట్‌ సీజ్‌

Tandoori Chicken

Updated On : April 3, 2021 / 10:54 AM IST

Tandoori chicken with stench : ఓ నాన్‌వెజ్‌ ప్రియుడు అందరిలాగే రెస్టారెంట్‌కు వెళ్లాడు. నచ్చిన చికెన్‌ ఐటమ్‌ ఆర్డర్ ఇచ్చాడు. ఎంతో ఇష్టంగా ఆరగిద్దామని అనుకునేంతలో కోపం తెప్పించే అనుభవం ఎదురైంది. అంతే! అధికారులకు ఫిర్యాదు చేసి మరీ నిర్వాహకులకు జరిమానా పడేలా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ పట్టణ వాసి ఒకరు బీసీఎం రోడ్డులోని రెస్టారెంట్‌కు శుక్రవారం వెళ్లారు.

తనకిష్టమైన తందూరీ చికెన్‌ కావాలని వెయిటర్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. దాన్ని తినబోగా దుర్వాసన వచ్చింది. అది చద్ది పదార్థమని గ్రహించిన అతడు వెంటనే పురపాలక కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు వెంటనే స్పందించి తనిఖీ చేశారు.

నాణ్యత లేని చికెన్‌ వంటకాన్ని వడ్డించినట్లు తేల్చారు. రెస్టారెంట్‌ను సీజ్‌ చేసి నిర్వాహకులకు రూ.15 వేలు జరిమానా విధించారు. తనిఖీల్లో పారిశుద్ధ్య అధికారి వాణికుమారి, జవాన్లు యాసిన్‌, శ్రీను, నాగేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు.