Teachers ST Reservations : టీచర్ల ఎస్టీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం

వంద శాతం టీచర్ల ఎస్టీ రిజర్వేషన్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై..

Teachers ST Reservations : వంద శాతం టీచర్ల ఎస్టీ రిజర్వేషన్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు 100 శాతం ఎస్టీలకే కేటాయిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు జరిమానా కూడా విధించింది సుప్రీంకోర్టు.

Supreme Court : ఆర్య సమాజ్ పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..వారిచ్చే వివాహ ధ్రువపత్రం చెల్లదు

సర్వోన్నత న్యాయస్థానం విధించిన జరిమానాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బోస్ ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్టీ రిజర్వేషన్ల వ్యవహారంలో ఒక్కో రాష్ట్రానికి రూ.2.50 లక్షల జరిమానా విధించింది సుప్రీంకోర్టు. జరిమానా విధించిన మొత్తాన్ని రెండు వారాల్లో చెల్లించాలని మరికొంత సమయం ఇచ్చింది ధర్మాసనం. చెల్లించని పక్షంలో.. కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపడతామని హెచ్చరించింది.

Sedition Hearing : దేశద్రోహ చట్టం అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగానే జరిమానా చెల్లించలేదని వివరించారు. ఈరోజు నుంచి రెండు వారాల్లో చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. గిరిజన ప్రాంతాలతో సహా అన్ని చోట్ల రిజర్వేషన్ల వ్యవహారంలో రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు