Sedition Hearing : దేశద్రోహ చట్టం అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

Sedition Hearing : దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయరాదని సుప్రీం స్పష్టం చేసింది.

Sedition Hearing : దేశద్రోహ చట్టం అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

Sedition Hearing All Pending Sediton Cases To Be Kept In Abeyance, Says Supreme Court

Sedition Hearing : దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయరాదని సుప్రీం స్పష్టం చేసింది. ఇదివరకే నమోదైన కేసుల్లోనూ ఎలాంటి చర్యలు తీసుకోరాదని పేర్కొంది. రాజద్రోహం చట్టం 124ఎ అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 124Aపై కేంద్రం పునః పరిశీలన పూర్తి అయ్యేవరకు ఈ సెక్షన్‌ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని సూచనలు చేసింది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. హనుమాన్‌ ఛాలీసా పటించినప్పుడు 124A కింద కేసులు నమోదు చేయడాన్ని అటార్నీ జనరల్‌ తప్పుబట్టారు. 124A సెక్షన్‌ కింద కేసులో జైలులో ఉన్న వారు సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చునని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజద్రోహం కేసు విచారణలో సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి.

రాజద్రోహం సెక్షన్ 124ఎ రాజ్యాంగ బద్దంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ ధర్మసనం విచారించింది. రాజద్రోహం వ్యవహారంలో ఎలాంటి గుర్తించదగిన నేరాన్ని నిరోధించలేమని ఎస్. జి తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. గుర్తింపదగిన నేరం విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదును ఆపలేమని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. దేశద్రోహ చట్టం నమోదు చేయాలంటే ఎస్పీ స్థాయి అధికారి అనుమతి తీసుకోవాలని ఎస్.జి తెలిపింది. దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలించే వరకు కొన్ని చర్యలు తీసుకోవచ్చనని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలను ధర్మాసనం ముందు ఉంచుతున్నట్లు తుషార్ మెహతా పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న దేశద్రోహ కేసులు కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్నాయి.. కాబట్టి కోర్టులే నిర్ణయం తీసుకోవాలని ఎస్.జి (సొలిసిటర్ జనరల్) తెలిపారు. దేశద్రోహానికి సంబంధించిన కేసుల్లో, బెయిల్ దరఖాస్తుపై సత్వర విచారణకు అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. కొన్ని కేసుల్లో నేర తీవ్రత ఎలా ఉంటుందో తెలియదని, ఇతర కేసులతో వాటిని జత పరిచి చూడలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Sedition Hearing All Pending Sediton Cases To Be Kept In Abeyance, Says Supreme Court (1)

Sedition Hearing All Pending Sediton Cases To Be Kept In Abeyance, Says Supreme Court

ప్రభుత్వం తరపున వాదనను వ్యతిరేకించిన పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. కేదార్ నాథ్ కేసుతో సంబంధం లేకుండా 124ఎ చట్టంలో సమూల మార్పులు రావాలని కోరుతున్నట్లు సిబల్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధితులు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదన్నారు. ప్రజా ప్రయోజనం వ్యాజ్యం మాత్రమేనని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికిప్పుడు ఈ సెక్షన్ కొట్టివేయాలని కోరుతున్నారా అని సిబల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. దేశంలో న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవాన్ని తగ్గించవద్దని తుషార్ మెహతా వ్యాఖ్యానించింది. కేసు తీవ్రతను బట్టి 124ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. తీవ్రవాదానికి సంబంధించిన కేసులు వస్తే.. 124ఏ కింద కేసు నమోదు చేయకుండా ఉండలేరని కేంద్రం తెలిపింది. 124ఏ సెక్షన్ అమలును పూర్తిగా నిలిపివేయాలని పిటీషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోరారు.

Read Also : Supreme Court : ఢిల్లీ షాహిన్ బాగ్ లో కూల్చివేతలపై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు